పచ్చి పాలు తాగితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పచ్చిపాలలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉండటంతో అవి కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. పచ్చిపాలలో కొన్ని మలినాలుండే అవకాశం ఉంది. ఆ పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పచ్చి పాలను రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు అస్సలు తాగకండి. పచ్చిపాలు తాగితే ఎసిడిటీ, అజీర్తి వంటివి వస్తాయి.