మీరిచ్చిన హామీలు నెరవేర్చమంటే ఈ నిర్బంధాలేంటి జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్. cps రద్దు విషయంతో రాష్ట్రమంతటా ప్రభుత్వ ఉద్యోగస్తులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో, ఈ విషయంపై స్పందించి లోకేష్ మాట్లాడుతూ... ప్రతిపక్షంలో వున్నప్పుడు మీరు ఇచ్చిన మాట నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేయడమే దేశద్రోహంగా సీపీఎస్ ఉద్యోగుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం దారుణం.
న్యాయమైన డిమాండ్ల సాధనకి శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కునీ హరించడం ముమ్మాటీకీ నియంతృత్వ పోకడే. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకి సాగుతున్న శాంతియుత ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా జగన్‌రెడ్డి సర్కారు ఉద్యోగులు, ఉద్యోగసంఘ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, బైండోవర్లు అన్నీ బేషరతుగా ఎత్తేయాలి. ఉద్యోగులకి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అని డిమాండ్ చేసారు.