వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదంపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా స్పందించారు. శుక్రవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాధవ్ వీడియో వ్యవహారంపై తమకు ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa