ట్విట్టర్లో ఎడిట్ ఫీచర్ కావాలంటూ గత కొన్ని రోజుల నుంచి యూజర్లు కోరుతున్న సంగతి తెలిసిందే. కాగా ఎడిట్ ఆప్షన్ను ప్రవేశపెట్టబోమని ట్విట్టర్ గతంలో ప్రకటించింది. అయితే పూర్తిస్థాయి యూజర్లకు త్వరలోనే ఎడిట్ ట్వీట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం యూజర్లకు కనిపించే ఎడిట్ బటన్ పనిచేయదని, ముందుగా ఈ ఫీచర్ను ట్విట్టర్ బ్లూ యూజర్లకు పరిచయం చేయనుంది.