ఏపీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన్ని హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమలాపురంలో శుక్రవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని డాక్టర్స్ సూచించారు.దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. అయితే ప్రస్తుతం పినిపే ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.