భీమిలి జీవీఎంసీ జోన్-2 మధురవాడ 5వార్డుల పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాజీవ్ గృహకల్ప(జే. ఎన్. ఎన్. యు ఆర్. ఎమ్. కాలనీ), అంబేద్కర్ కాలనీ(బోరవానిపాలెం) సద్గురు సాయినాథ్ కాలనీ, స్వతంత్రనగర్ ప్రాంతాలలో నిర్వహించిన భారీ అన్నసంతర్పణలకు కార్పొరేటర్ మొల్లి హేమలత, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసాదవితరణ నిర్వహించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మొల్లిహేమలత మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలుస్తు ముందుకు నడవాలని, అందుకు తమసహాయ సహకారాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయని తెలియజేశారు, ముఖ్యంగా యువత తమ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని, సామాజిక సత్ప్రవర్తనతో. మెలగాలని, స్థానిక యువతను కోరారు. వివిధ కాలనీల ప్రజలు గణనాధుని అన్నసంతర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నమ్మి శ్రీను, ఈగలరవి, జోగేశ్వరపాత్రో, ఇయ్యపు నాయుడు, ఓలేటి శ్రవణ్ ఈగల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.