74. 62% మార్కెట్ వాటాతో, 33 రకాల పాలసీలతో, గత ఆర్థిక సంవత్సరంలో 267. 33 లక్షల పాలసీ క్లైములు చెల్లించి భారతీయుల జీవితాలతో ఎల్ఐసి మమేకమై పనిచేస్తొందని సంస్థ కడప డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె. గిరిధర్ అన్నారు. బీమా వారోత్సవాల నేపథ్యంలో సంస్థ ప్రగతిని వివరిస్తూ ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
సెప్టెంబర్ 1 నాటికి 66 సంవత్సరాల తన ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని, 67 వ సంవత్సరంలో ఎల్ఐసి అడుగు పెట్టిందని, తన వ్యాపార కార్యకలాపాలని 14 దేశాలకు విస్తరింప జేసిందని అన్నారు. ప్రజల ముంగిట్లో సత్వర సేవలందించాలన్న జాతీయకరణ లక్ష్యాలకు అనుగుణంగా 2048 బ్రాంచ్ ఆఫీసులు, 1564 శాటిలైట్ ఆఫీసులు, 44, 900 ప్రీమియం పాయింట్లు ఏర్పాటు చేసి లక్ష మంది సిబ్బంది, 13 లక్షల మంది ఏజెంట్ల ద్వారా, ఆన్ లైన్ సేవలు, తాజాగా ఆనంద, జీవన సాక్ష్య లాంటి డిజిటల్ ఇనిషియేటివ్స్, యాప్స్ ద్వారా ప్రపంచంలో ఏ జీవిత బీమా సంస్థ కూడా అందించని నాణ్యమైన సేవలు ఎల్ఐసి అందిస్తోందని అన్నారు. ఫలితంగానే సంస్థ గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్థానం సంపాదించిందని, సంస్థ బ్రాండ్ కు, సేవలకు అనేక అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు వచ్చాయని ఆయన తెలిపారు.
ఎల్ఐసి ఆస్తులు రూ. 42 లక్షల కోట్లకు, లైఫ్ ఫండ్ రూ. 37 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన తెలిపారు. ఎల్ఐసి అనే మహా వృక్ష ఛాయలో గ్రూప్ ఇన్సూరెన్స్, హౌసింగ్, పెన్షన్, మ్యూచువల్ ఫండ్, అసెట్ మేనేజ్మెంట్, కార్డ్స్ సర్వీసెస్ ఇలా వివిధ రకాల సేవలు అందించే సంస్థలు పని చేస్తున్నాయని అన్నారు. గోల్డెన్ జూబ్లీ ఫండ్ ద్వారా విద్య, ఆరోగ్య, ఇతర అంశాల్లో సంస్థ సామాజిక సేవ చేస్తోందని అన్నారు. రాబోయే కాలంలో కూడా పాలసీదారుల నమ్మకాన్ని నిలుపుకునే దిశగా సిబ్బంది కృషి చేస్తారని, రాబోయే కాలంలో కూడా ఎల్ఐసి సంస్థ తన పోషిస్తుందని ఆయన అన్నారు