జగనన్న స్నార్ట్ టౌన్ షిప్- ఎంఐజిలేవుట్ లో మౌలిక వసతులును ప్రభుత్వం కల్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లబ్ధిదారులకు హామీఇచ్చారు. లే ఔట్ లో ప్రధాన రహదారులు నలభై అడుగుల వెడల్పు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, త్రాగునీటి వసతులు, విద్యుత్ తదితర మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు.
ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో ఎం ఐ జి లే అవుట్ లో ప్లాట్ ధర ఇతర పట్టణాల్లో మాదిరి రాయచోటి లో కూడా చదరపు గజం విలువ రూ. 7 వేలుకు పైగా నిర్ణయించగా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి ఇక్కడి ఉద్యోగుల, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని చదరపు గజం రూ 5 వేలు కన్నా లోపే ఉండేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వం సానుకూలం నిర్ణయం తీసుకునేలా శ్రీకాంత్ రెడ్డి చేసిన కృషిపై ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేసి శ్రీకాంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.