విశాఖపట్నం, నర్సీపట్నం: తాండవ జలాశయం ఎడమ ప్రధాన కాలువ 2వ కిలోమీటర్ వద్ద నున్న ఇనుప గేటు విరిగిపోడంతో పంట పొలాలకు వెళ్లే నీరు వృధా అవుతుంది . పరిసర ప్రాంతాల రైతులు జలాశయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో జలాశయం నుంచి వచ్చే నీటిని నిలుపుదల చేశారు. అధికారులు మరమత్తులు చేపట్టకపోడం వలనే గేటు ఇరుగుపోయిందని రైతులు చెబుతున్నారు.
ఖరీఫ్ కు నీరు విడుదల సమయంలో ఈ గేట్లు ద్వారా 35 క్యూసెక్కల నీటిని తాండవ నదిలోకి విడుదలచేస్తారు. ఈ గేట్ల మరమత్తులు చేపట్టకపోడం వలనేఈ గేటు విరుగుపోయిందని రైతులు అంటున్నారు.