మాంసం తినేవారికి అలర్ట్. విజయవాడలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ దాడుల్లో కుళ్లిపోయిన మాంసంను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో దాదాపుగా 500 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.