తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. కడలూరు జిల్లాలోని ఓ గ్రామంలో 11వ తరగతి చదివే 16 ఏళ్ల బాలిక శనివారం బిడ్డను ప్రసవించింది. పసికందును పొదల్లో పడేయడంతో ఆ బిడ్డ మృతి చెందింది. హెచ్ఎం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. 10వ తరగతి చదివే తన ప్రియుడి వల్ల గర్భం దాల్చినట్లు బాలిక బదులిచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.