తాగునీరు అవసరం మేరకు పట్టుకుని కుళాయిలను కట్టివేయాలని అంతేకాని రోడ్లపైకి వదిలి వృధా చేయరాదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అన్నారు. సోమవారం గుంతకల్లు పట్టణం లోని 14, 15, 29, 30, 33 వార్డులలో కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులను కమీషనర్ పరిశీలించారు. వర్షం కారణంగా ఆయా వార్డులలో రోడ్లపై నిలిచిపోయిన నీరును తొలగించాలని కార్మికులకు సూచించారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హేమచంద్ర కుమార్, కౌన్సిలర్లు, సచివా లయ సిబ్బంది ఉన్నారు.