చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి ఆధ్వర్యంలోనే లిక్కర్ డీల్స్ జరిగాయని వైయస్ఆర్‌సీపీ మహిళా మంత్రులు, ప్రజా ప్రతినిధులు విరుచుకుపడ్డారు. లిక్కర్‌కు బాబు కుటుంబానికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. కనిపించేది పాల వ్యాపారం... తెర వెనక లిక్కర్ బేరం అంటూ ధ్వజమెత్తారు. అత్తాకోడళ్ళు... ఇద్దరికీ ఇదే పని అని విమర్శించారు.
మద్యం లైసెన్సులు ఇప్పించటం ఈ ఇద్దరికీ కాటేజ్ ఇండస్ట్రీ అన్నారు. చంద్ర బాబు హయాంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలన్నింటికీ లైసెస్సులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రి కే వీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఎస్సీ(మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి. అమ్మాజీ మీడియాతో మాట్లాడారు.