ఓ యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గఢ్లో జరిగింది. భారీ వర్షాలకు భైరవీ నది ప్రవాహం పెరిగిపోవడంతో డ్యామ్ గేట్లను తెరిచారు. దీంతో దగ్గరలోని దుకాణాలు, నివాస ప్రాంతాల మీదుగా నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ సమయంలో పిప్రాజ్రా గ్రామానికి చెందిన సంతోష్ మాంఝీ అనే వ్యక్తి ఆ నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించి కొట్టుకుపోయాడు. అతడి ప్రస్తుత పరిస్థితి గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.