గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ విజయవాడ సెక్టార్ దగ్గర సోమవారం ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని ఆర్టీసీ డిపో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. విధులలో ఉన్న ఈస్ట్ ట్రాఫిక్ సీఐ వీరనాయక్, ఎస్ఐ హరిబాబు వేగంగా స్పందించి స్థానికుల సహాయంతో ఆ బస్సులో మంటలను ఆర్పి వేశారు. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ప్రయాణికులను కాపాడారు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa