విశాఖపట్నం, సబ్బవరం: మండలం లోని ఆరిపాకలో మందు గుండు పేలి నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మంగళవారం నాడు మందు గుండు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలియజేసారు. ఈ ప్రమాదం లో మహేష్, కమలమ్మకు లకు తీవ్రంగా ఒళ్ళు కాలిపోగా శంకర్, ప్రసాద్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి ఆని తెలిపారు. తీవ్ర గాయాలు పాలైన మహేష్ కమలమ్మకు చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సబ్బవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం తాలుక వివరాలు సేకరిస్తున్నారు.