ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 05:03 PM

విశాఖపట్నం, మునగపాక: మండలంలో జగనన్న ఇళ్ల కాలనీని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని వాడ్రాపల్లి గ్రామ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు కోరారు. గ్రామ సచివాలయంలో జగనన్న కాలనీ లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ నూకరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు ప్రభుత్వం పట్టాల మంజూరు చేసిందని త్వరిత గతిన నిర్మాణం చేపట్టాలని కోరారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఆదేశాల మేరకు ప్రతి లబ్ధిదారుడు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సకాలంలో ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు నిర్మించుకోకుంటే పట్టాలు రద్దుచేసే వీలుందని ప్రతి ఒక్కరు ఇల్లు కట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సింహం, విఆర్వో జయ కృష్ణ, కమిటీ చైర్మన్ మల్ల కనుమనాయుడు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com