విశాఖపట్నం: వార్డులో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యమని నగర మేయర్ గొలగాని వారి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె 11వ వార్డు పరిధిలోని బాలాజీ నగర్, డ్రైవర్స్ కాలనీ, అప్సర కాలనీ ప్రాంతాలలో సుమారు రూ. 45. 70 లక్షల వ్యయంతో తారురోడ్డులు మరమ్మతులు చేపట్టేందుకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించామని రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రతి వార్డు లోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయుటకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్క పేదవానికి అందేoదుకు వాలంటరీలు, సచివాలయ వ్యవస్థని స్థాపించి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని తెలిపారు. వార్డులో ప్రజలకు కనీస అవసరాలైన త్రాగు నీరు విద్యుత్తు పారిశుద్ధ్యం మొదలైన పనులు పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్, వార్డ్ అధ్యక్షులు సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షులు బోని శ్రీను, మహిళా అధ్యక్షురాలు పద్మ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మోహన్ రావు, సకినా బేగం, సచివాలయం సెక్రటరీలో, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.