14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన చేశారా..? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. బుధవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బ తిన్నదో ఇంకా నిర్దారించ లేదు. డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది అనేది నిర్దారించడానికి సమయం పడుతుందన్నారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ సంస్ధ నిర్దారణ చేయడానికి సమయం పడుతుందని చెప్పిందన్నారు. పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ నేతలు కోనసీమలో ఉన్న కొబ్బరి కాయలు కొడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే మేమే నిర్మిస్తామని చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసిందని అంబటి ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీ కారణం కాదా..? డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదానికి వేరే దేశంలో అయితే ఉరి వేసేవారు అన్నారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పీపీఏను, సీడబ్ల్యూసీని, కేంద్రాన్ని అడుగుతాం. సమయం వచ్చినప్పుడు కేంద్రాన్ని అడగుతామన్నారు.