తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ముసునూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి కుటుంబాన్ని కరుణాకర్ పరామర్శించారు. కరుణాకర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కరుణాకర్ ఇద్దరు పిల్లల చదువు బాధ్యతలను తానే తీసుకుంటానని ప్రకటించారు. కరుణాకర్ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.జగన్ హయాంలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని లోకేష్ విమర్శించారు. దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఒక్క కేసులో కూడా వైసీపీ నేతలకు శిక్ష పడలేదన్నారు.