ముంబైలో 10 అడుగుల పొడవున్న కొండచిలువకు డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గాయాలతో ఉన్న ఈ కొండచిలువను గత నెలలో అటవీ శాఖ రక్షించింది. అప్పటి నుంచి పాము తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ పైథాన్ కు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు డాక్టర్ రినా దేవ్ తెలిపారు. గత 45 రోజులుగా పాము చికిత్స పొందుతోందని, ఇప్పటికే 2 సర్జరీలు జరిగాయని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీకి 3 గంటలు పడుతుందని తెలిపారు.