కళ్ల కింద నల్లటి వలయాల సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్ పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, ఎక్కువగా కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం లాంటివన్నీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలుగా చెప్పొచ్చు. మరి వీటిని తగ్గించుకునే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నల్లటి వలయాలను పోగొట్టడంలో టీ బ్యాగ్స్ బాగా సహాయపడతాయి. 10 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్లపై ఉంచుకుని 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
- కొంచెం టమాటో రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దనా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కేవలం నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండు సార్లు కళ్ల కింద అప్త్లె చేసినా ఫలితం ఉంటుంది.
- ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటే కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.
- చల్లటి కీరా లేదా ఆలుగడ్డ ముక్కల్ని కళ్లపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. క్రీం అప్త్లె చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆలుగడ్డ పొట్టు, రసం కూడా ఈ నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి.
- పడుకునే ముందు కాస్త బాదం నూనెను తీసుకుని కళ్ల చుట్టూ మర్దనా చేయాలి.
- కళ్లను పదేపదే నలపడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయొద్దు.
- పైనాపిల్ రసంలో కొద్దిగా పసుపు కలుపుకొని నల్లటి వలయాలున్న చోట మర్దన చేసుకోవాలి.
- రాత్రి పడుకునే ముందు కొద్దిగా పుదీనా రసాన్ని కళ్ల కింద రాసుకోవాలి. పొద్దున లేవగానే కడిగేసుకుంటే నల్లటి వలయాలు పోతాయి.
- నారింజపండు రసంలో కొద్దిగా గ్లిజరిన్‌ను కలిపి కంటి చుట్టూ పూస్తే కళ్లకే కాకుండా ముఖానికి మంచి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగపడుతుంది.
- కాటన్ బాల్స్ ను రోజ్ వాటర్ లో ముంచి కంటి రెప్పలపై నెమ్మదిగా రాస్తే వలయాలు పోవడమే కాక కంట్లోని వేడి కూడా తగ్గుతుంది.
- తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు, విటమిన్ సి, డి, ఇ పుష్కలంగా ఉండే ఆహారం తినాలి.
- రోజుకు 8 గంటలు నిద్రపోవాలి.
- రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేయకుండా పడుకుంటే నల్లటి వలయాల సమస్య మరింత ఎక్కువవుతుంది.