చిత్తూరు: తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం కంటేవారిపల్లి దగ్గర గురువారం సాయంత్రం టమోటా లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రమేష్ బాబు(53) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులని స్థానికులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా నల్లచెరువులో టమోటా లోడు వేసుకుని కడప జిల్లాకు వెళుతున్న లారీ మార్గమధ్యంలోని కంటేవారిపల్లి దగ్గరికి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa