ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ వర్థంతి నాటికి జగనన్న కాలనీ ప్రారంభించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 12:53 PM

కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటం లోవైయస్సార్ జగనన్న కాలనీలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే లు శుక్రవారం పరిశీలించారు. జగనన్న కాలనీ లో మిగిలిన రోడ్లు, డ్రైన్లు బ్యూటిఫికేషన్, త్రాగునీరు వంటి సౌకర్యాలను సిద్ధం చేసేందుకు కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే పలు సూచనలు చేశారు. రెండు నెలల కాలంలో జగనన్న కాలనీలో అన్ని వసతులను ఏర్పాటు చేయాలని డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి నాటికి ప్రారంభోత్సవం చేసేందుకు సిద్దం చేయాలన్నారు. అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులు 25 లక్షలతో జరుగుతున్న 350 మీటర్ల సిసి డ్రైన్ మరియు కల్వర్టు నిర్మాణ పనులు పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com