దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 34ను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని వైసీపీ నాయకుడు చల్లారామయ్య అన్నారు. బాపట్లలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్ రాజ్ పిలుపుమేరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా సీఎంకు కృతజ్ఞతల కార్యక్రమం నిర్వహిస్తునట్లు తెలిపారు.