ప్రత్తిపాడు: పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని తెలుసుకునేందుకు ఎకరాకు 20 వరకు లింగాకర్షణ బట్టలు ఏర్పాటు చేయాలని లాంఫాo శాస్త్రవేత్తలు, నగేశ్, కిశోర్ బాలా చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు లో గురువారం శాస్త్రవేత్తలు పత్తి పంటను పరిశీలించారు. గులాబీ రంగు పురుగును లింగాకర్షక బుట్టలతో తొలి దశలోనే గుర్తించవచ్చుని చెప్పారు. డీఆర్ సీ డీపీడీ పి. రామాంజనేయులు, ఏడిఏలు ప్రవీణ, జి. సాంబశివరావు, ఉపసర్పంచి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.