తాడిపత్రి పట్టణంలోని రైల్వే వంతెన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు. పుట్లూరు మండలం కుమ్మలమల గ్రామానికి చెందిన అబ్దుల్ రజాక్ ద్విచక్రవాహనంపై తాడిపత్రికి వస్తుండగా రైల్వే వంతెన వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని చెప్పారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపు రానికి తరలించారు.