తాడిపత్రి పట్టణంలోని పాత పెన్నాబ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి 12. 00 గంటల సమయంలో వ్యక్తి పెన్నానదిలో ఇరుక్కుపోయాడని స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సీఐ మోహన్ బాబు ఆధ్వ ర్యంలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమ యంలో వ్యక్తి కనబడక పోవడంతో ధ్వని సాయంతో పట్టుకుని రక్షిం చినట్లు చెప్పారు. తాడిపత్రి గ్రామీణ పోలీసులు కూడా అక్కడికి చేరు కుని సహాయక చర్యలు చేపట్టారు.