తాడిపత్రి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కక్షసాధింపులపై దృష్టి సారిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. తాడిపత్రి అర్ అండ్ బీ అతిథి గృహంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి హక్కుల కోసం పోరాడే వారిని అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెడితే ముందస్తు అరెస్టులు, వారిపై కేసులు పెట్టడం అసమం జమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రైతుల బోరు బావుల వద్ద మీటర్లు ఏర్పాటుతో మెప్పు పొందాలని చూస్తూ న్నారని అన్నారు. ప్రకాష్ అనే కానిస్టేబుల్ తనకు ప్రాణహాని ఉందని ఎస్పీపై ఫిర్యాదు చేశాడంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే గుణ పాఠం చెబుతారన్నారు. సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నాయ కులు మల్లికార్జున, రంగయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.