పెద్దపప్పూరు: చాగల్లు ప్రాజెక్టు నుంచి దిగువ పెన్నాకు నీరు విడుదల చేయనున్నారని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. ఏ చిన్నపాటి సమస్యా చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని నీటిపారుదల శాఖ సిబ్బందికి తెలిపారు. గురువారం చాగల్లు ప్రాజె క్టును ఎస్పీ సందర్శించి, నీటి ఉధృతిని పరిశీలిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నదీ పరివాహక గ్రామాల్లోని అశ్వత్థనారాయణస్వామి, జూటూరు కాజ్వీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశా మన్నారు. నది లోతట్టు ప్రాంతాల్లోకి ఎవ్వరూ వెళ్లరాదని, ఏదైనా సమస్య వస్తే హెల్ప్ సెంటర్కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. పాత తహ సీల్దార్ కార్యాలయ సమీపంలోని నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి యోగక్షే మాలను పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం లో డీఎస్పీ వీఎన్ కె చైతన్య, సీఐ రామక్రిష్ణ, ఎస్ఐ ఖాజాహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.