ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు శనివారం ప్రకటించాడు. గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఫించ్ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఫార్మాట్ల విషయంలో రిటైర్మైంట్ విషయంలో ఫించ్ స్పష్టత ఇవ్వలేదు. ఇక తన వన్డే కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన ఫించ్ 17 సెంచరీలతో సహా 5401 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa