ఏపీలో విజయనగరం జిల్లాలో ప్రస్తుతం వరదలు హడలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలకు చంపావతి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో గజపతినగరంలోని పలు ప్రాంతాల్లో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మర్రివలస గ్రామానికి చెందిన ఓ యువతి శనివారం విశాఖలో జరిగే పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని పీకలలోతు ఉన్న ప్రవాహంలో ఉన్న నదిని దాటించారు. ఈ సంఘటనను వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టగా విపరీతంగా వైరల్ అవుతోంది. పరీక్షల కోసం ఆ యువతి తాపత్రయాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, ఆ ప్రాంతంలో వంతెన కూడా నిర్మించకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa