ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నకిలీ లోన్ యాప్స్, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లోన్ యాప్స్ మాయలో పడవద్దని చిత్తూరు తాలూకా సిఐ మద్దయ్యచారి అన్నారు. జీడీ నెల్లూరు మండలం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లో లోన్లు ఇస్తామంటూ, ఎవరైన ఈ రుణాల విషయంలో వేధింపులకు గురి చేస్తే బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని ప్రజలకు సూచించారు.