మధ్యధరా సముద్రంలో ట్యునీషియా తీరంలో గత వారం వలసదారుల పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని ట్యునీషియా మీడియా తాజాగా ప్రకటించింది. పడవలో 37 మంది ప్రయాణించగా గత వారం అది బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 14 మందిని రక్షించారు. బోటులో ఉన్న 12 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వారిలో 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన ఆ దేశంలో విషాదం నింపింది.