పాడేరు ఘాట్ లో ఆర్టీసీ బస్సు కి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆదివారం విశాఖ నుండి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకు పోయింది. మలుపు వద్ద పవర్ స్టీరింగ్ పట్టేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 20 మంది ప్రయాణికులతో పాడేరు ఘాట్ లో ప్రయాణిస్తుండగా కోట్ల గరువు మలుపు ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మట్టిలో బస్సు చక్రాలు చిక్కడంతో బస్సు బోల్తా పడకుండా ఒరిగిపోయింది. అయితే బస్సు దూసుకు వెళ్లిన కాస్త దూరంలో విద్యుత్ స్తంభం ఉంది. రెండు అడుగులు పెళ్లి ఉంటే స్తంభాన్ని ఢీకొని పెనుప్రమాదం జరిగిఉండేదని ప్రయాణికులు వాపోతున్నారు. గత ఆదివారం సిమ్లా నుంచి విశాఖకు యాపిల్ లోడుతో వస్తున్న లారీ రాజపురం వద్ద లోయలోకి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత గిరిజనులు దారిన పోయే వారు సిమ్లా యాపిల్స్ బాక్సులను తస్కరించడం విశేషం. రహదారికి ఒకవైపున రక్షణ కోడలు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అవసరమైన చోట్ల రక్షణ గోడలు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.