స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై సోమవారం సీఎం జగన్ సమీక్షించారు. నాడు-నేడు పాఠశాలల ఆడిట్ నివేదికను అధికారులు సీఎంకు అందజేయగా. ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో 124417 టోల్‌ఫ్రీ నంబర్‌ని ఉంచామని అధికారులు సీఎంకు తెలిపారు. టీచర్లు, 8వతరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ అంశంపైనా అధికారులతో సీఎం సమీక్షించారు.
5, 18, 740 ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించామని, అన్ని ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ వేయించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇకపై, ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శించనుండగా నెలకోసారి ఏఎన్‌ఎం వెళ్లాలని సీఎం సూచించారు. మండల స్థాయిలో ఉండే ఎంఈవోలలో ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని జగన్ ఆదేశించారు. తరగతి గదుల డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలన్నారు.