వృద్ధుల సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 14567 వినియోగించు కోవాలని జిల్లా సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం ఎస్. పి. కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ 14567 పోస్టర్ ను అయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ వృద్ధాశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు, కార్యాచరణ కేంద్రాలు, ఆసుపత్రులు తదితర వివరాల కోసం, పెన్షన్, చట్టపరమైన సమస్యలపై సలహాలు సూచనలకు కోసం, భావోద్వేగమైన విషయాలను హెల్ప్ లైన్ తో పంచుకోవడం కోసం "ఎల్డర్ లైన్ అందుబాటులో ఉందని తెలిపారు. వృద్ధులను హింసించినా, ఇంటి నుండి బయటకు గెంటి వేయబడిన హెల్ప్ లైన్కు తెలియపరచాలన్నారు.
జిల్లా పోలీసు యంత్రాంగం మరియు సచివాలయం మహిళా పోలీసులు ఈ హెల్ప్ లైన్ సేవలను ప్రజలకు తెలియపరిచేలా చేయాలనీ సూచించారు. అలాగే వృద్దులు, తల్లి తండ్రులు ఈ హెల్ప్ లైన్ 14567 సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్. బి. సిఐ ఎన్. శ్రీనివాసరావు, పాలకొండ సీఐ మురళీధర్ మరియు జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ టి. తిరుపతి రావు , మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.