వివిధ పథకాలను ప్రకటిస్తూ ముందుకెళతున్న ఏపీలోని వైసీపీ సర్కార్ తన అవసరాల కోసం అప్పుచేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది. ఈ రుణంలో రూ.55 కోట్లను 18 ఏళ్ల కాల వ్యవధికి 7.45 శాతం వడ్డీకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం... మరో రూ.500 కోట్లను 20 ఏళ్ల కాల వ్యవధికి 7.45 శాతం వడ్డీకి సేకరించింది. ఈ కొత్త రుణంతో ఏపీ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.48,608 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ ఏడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48000 కోట్లు కాగా... తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఆ పరిమితిని దాటేసింది.