ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తల కుటుంభాన్ని ఆదుకొన్న జనసేన నాయకత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 08:59 PM

తమ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే అట్టి కుటుంభాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తోంది. జ‌న‌సేన క్రియాశీల స‌భ్యుల‌కు ఆ పార్టీ బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీల స‌భ్యుడు పిన్న‌మ‌నేని వీర నాగాంజ‌నేయులు కుటుంబానికి ఆ పార్టీ రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అంద‌జేసింది. ఈ మేర‌కు కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం గూడూరు మండ‌లం క‌త్తుల‌వారిపాలెం వెళ్లిన జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌... బాధిత కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారం చెక్కును అంద‌జేశారు. బాధిత కుటుంబాన్ని ఆయ‌న ఓదార్చారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే... ఇటీవ‌లే మ‌ర‌ణించిన పార్టీ క్రియాశీల స‌భ్యుడు దాకార‌పు కొండలు కుటుంబానికి కూడా నాదెండ్ల రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అంద‌జేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com