డిసెంబర్ నాటికి నిర్దేశించిన ఇళ్ళ నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేయాలని , ప్రాధాన్యతా భవన నిర్మాణాలు గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు తదితర భవన నిర్మాణాలు నిర్దేశించిన సమయానికి పూర్తిచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు . మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని వీడియోకాన్ఫెరెన్స్ హాల్ లో మండలాల తహశీల్దార్లు , ఎం . పి . డి . వో . లు , హౌసింగ్ డి . ఈ ., ఏ . ఈ . లతో ఇళ్ళ నిర్మాణాలు , ప్రాధాన్యతా భవన నిర్మాణాలు తదితర పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు .
అనంతరం జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల వ్యవసాయంపై సమీక్ష చేస్తూ ఈ - క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని , ఉత్పన్నమయ్యే సమస్యలను నివృత్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు . ఈ వీడియోకాన్ఫెరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు , పంచాయతీరాజ్ ఎస్ . ఈ . ఈరాస్వామి , వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa