ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 27న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

national |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 01:57 PM

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్రం ఇప్పటికే సమాచారమిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa