అన్నమయ్య జిల్లా, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ని చంపిన కేసులో నిందితుడికి కఠిన జీవిత ఖైదు మరియు రూ. 1000 జరిమానా విధిస్తూ గౌరవ 5వ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి రాయచోటి తీర్పునిచ్చారు.ఈ కేసులో బాధితుల తరపున బలమైన ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించి ముద్దాయికి జీవిత ఖైదు మరియు జరిమానా పడేలా కృషి చేసిన APP జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు ట్రైల్ సమయంలో సాక్షుల విచారణ, కేసు రికార్డ్స్,కోర్ట్ వ్యవహారాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరచిన రామాపురం పోలీస్ స్టేషన్ అధికారులకు మరియు కోర్ట్ సిబ్బందికి జిల్లా ఎస్.పి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.