జీవనసాతి మాట్రిమోనియల్ వెబ్ సైట్‌లతో అమాయక ఆడవాళ్ళను మోసం చేసి,నగదు కాజేసిన ఘరానా సైబర్ మోసగాడి ని అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా పోలీస్ వారు తెలియజేసారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి వివరాలు వెల్లడించినారు. నరసరావుపేటకు చెందిన మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి,సమగ్ర దర్యాప్తు జరిపి,ముద్దాయిని అరెస్ట్ చేసి,రూ.38,20,000/- నగదు రికవరీ చేసినట్లు నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ.... ముద్దాయి పొట్లూరి.బాల వంశీ కృష్ణ Jeevansathi http://matrimonial.com వెబ్సైట్ కి సంబంధించి ఆంధ్రా మరియు తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 8 కేసులు మరియు Bank ATM frauds కి సంబంధించి 8 కేసులు.ముద్దాయి మొత్తం 17 కేసులలో నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడని మా దర్యాప్తులో తేలింది. ప్రజలు వివాహ సంబంధాల వెబ్ సైట్లతో జాగ్రత్త ఉండాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారిని నమ్మి మోసపోవద్దని, ఇంటర్నెట్ లోని కొన్ని యాప్స్ ద్వారా తెలియని వారితో పరిచయాలు పెంచుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీగారు సూచించారు.