నల్ల శనగల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే బరువు తగ్గుతుంది. మలబద్దకం సమస్య రాదు. మధుమేహం అదుపులోకి వస్తుంది. శనగల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శనగల్లో ఎ, సి, బి6, పోలేట్, నియాసిన్, థైమీన్, మాంగనీస్, ఫాస్సరస్, ఐరన్, కాపర్ లాంటి విటమిన్లు, ఖనిజాలుంటాయి. శనగలు తింటే కాలరీల శాతం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. నిద్రలేమి సమస్య పోతుంది.