స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను సవరించింది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ ను 70 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఈ వడ్డీ రేటు 12.75 నుంచి 13.45 శాతానికి చేరింది. సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక బేస్ రేట్ ను ఎస్బీఐ 8.7 శాతానికి పెంచింది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారం కానున్నాయి.