విజయనగరం, గజపతినగరం: లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్టేషన్ బూర్జివలస ఎస్. ఐ రాజేష్ తెలియజేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి రాయపూర్ కు అల్యూమినియం పౌడర్ తీసుకు వెళ్తున్న లారీ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం గజపతినగరం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.