ప్రతిపక్షం కేవలం రాష్ట్ర ఇమేజ్ ని దిగజార్చడం కోసం, విషం చిమ్మడంకోసం పనిచేసింది అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అయన మాట్లాడుతూ.... ఒక బాధ్యత గలిగిన ప్రతిపక్షంగా ఎప్పుడూ పనిచేయలేదు. ఈ రాష్ట్రం శ్రీలంకం అయిపోతుంది, అథోగతి పాలౌతుందిఅని ఎంతో విషం చిమ్ముతోంది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పత్రిపక్షనాయకుడే. ఈ ఆరునెల్లలో దేశంలో లక్షా డెభైఒక్క వేల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో దాదాపు 41వేల కోట్లు మన ఏపీలోనే పెట్టుబడులు పెట్టారు. అంటే దేశంలో జరిగిన ఇన్వెస్టమెంట్స్ లో 25%. దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డిగారి పాలనవల్లే..గతంలో బాబు ముఖం చూసి, ఇమేజ్ ని చూసి పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసారు. కానీ అది నిజం కాదు.. పెట్టుబడులు కేవలం పెట్టుబడిదారుడికి లాభము, అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ సహకారం ఎక్కడుంటుందో అక్కడే పెట్టుబడులు వస్తాయి. జగన్ నిష్పక్షపాతమైన పరిపాలన వల్లనే ఈ పెట్టుబడులు సాధ్యం అయ్యాయి.