నడక అన్నది మన శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్. అందుకే డాక్టర్లు రోజూ కనీసం 15 నుంచీ 30 నిమిషాలు నడవమని చెబుతున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, వర్క్ టెన్షన్లలో బీజీ అయినా... ఏదో ఒక రకంగా నడిచేందుకు వీలుండేలా చేసుకోవాలి. వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే కచ్చితమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెయిన్ చురుగ్గా తయారవుతుంది. నడవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. నడవడం వల్ల మన శరీరంలో ఎండోర్ఫిన్స్ ఎక్కువగా విడుదలవుతుంది. ఫలితంగా స్ట్రెస్ తగ్గుతుంది. ఓవరాల్‌గా మెదడుకు వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. నడక వల్ల అల్జీమర్స్, డైమెన్షియా వంటి మతిమరపు సమస్యలు రాకుండా ఉంటాయి. నడవడం వల్ల కంటి చూపు బాగుపడుతుంది. అలాగే కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. చూపు కోల్పోయేందుకు కారణమయ్యే గ్లకోమాను అడ్డుకుంటుంది. పరుగుతో కలిగే ప్రయోజనాలు నడకతోనూ కలుగుతాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ తెలిపింది. గుండె నొప్పి, ఇతర గుండె జబ్బులు రాకుండా నడక కాపాడుతుంది. రక్త సరఫరా కూడా మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.
నడవడం వల్ల మనం మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను మన శరీరానికి ఇస్తాం. అదే సమయంలో బాడీలో విషవ్యర్థాలు బయటకు పోతాయి. నడవడం వల్ల ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. పాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు గ్లూకోజ్ లెవెల్స్ సరిగ్గా ఉండాలని భావిస్తే, తరచుగా నడిచే అలవాటు చేసుకోండి. డయాబెటిస్‌ను ఎదుర్కోవడానికి పరుగు కంటే నడకే మంచిదని పరిశోధనలో తేలింది. ఆరు రెట్లు ఎక్కువగా పరిగెత్తే వారి కంటే నడిచేవారికే బ్లడ్ షుగర్ లెవెల్స్ చక్కగా ఉన్నట్లు తెలిసింది.
జీర్ణక్రియ మెరుగవుతుంది. మనం నడుస్తున్నప్పుడు మన పేగులు బాగా కదులుతాయి. అందువల్ల మన పేగులు క్రమ పద్ధతిలోకి వస్తాయి. అందువల్ల కేన్సర్ లాంటివి సోకకుండా ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. బాడీలో ఫ్యాట్ పోతున్నకొద్దీ... అవి మరింత ఆరోగ్యంగా మారతాయి. ఇందుకోసం మీరు కనీసం 10వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. మీరు ఏ ఎత్తైన ప్రాంతానికో నడుస్తూ వెళ్తే మధ్యమధ్యలో ఆగి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. దీని వల్ల మీ శరీర కండరాలు చురుగ్గా మారతాయి. పైగా మనకు నడవడం అలవాటైపోతే అప్పుడు అది కష్టంగా అనిపించదు. రోజూ 30 నిమిషాలు నడిస్తే, కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు తగ్గుతాయి. కీళ్లు బలంగా మారతాయి. గాయాలు తగ్గుతాయి. ఎముకలు పెళుసుగా అయిపోకుండా ఉంటాయి.