కేరళలోని కాసర్ గోడ్ లో కుక్కల భయం ఎక్కువైంది. విద్యార్థులు స్కూలుకు వెళ్లేదారిలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు వాటి భయానికి స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో సమీర్ అనే వ్యక్తి తన ఎయిర్ గన్ సాయంతో విద్యార్థులకు కాపలాగా వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.