అన్ని సీజన్లలో దొరికే కూరగాయలు బెండకాయలు. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తారు చాలా మంది. ముఖ్యంగా బెండకాయ ఫ్రై వరల్డ్ వైడ్ ఫేమస్. బెండకాయల్ని ఎలా తిన్నా వాటిలో పోషకాలు కొంతవరకూ మనకు అందుతాయి. ఐతే పూర్తిగా పోషకాలు అందాలంటే చిన్న చిట్కా మనం పాటించాల్సి ఉంటుంది.
చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని, బాగా కడిగి, వాటి మొదలు, చివరల్ని తీసేయాలి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలో పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నే నీటిలోని బెండ ముక్కల్ని తీసేసి నీటిని తాగాలి. అప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఈ బెండకాయ వాటర్ మన పొట్టలో పేగులు, జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి. ఎసిడిటి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువ. అది ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
బెండకాయలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె పదిలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బెండకాయల్ని నానబెట్టిన నీరు ఎంతో మేలు చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే బెండకాయ వాటర్ తాగాలి. కంటి చూపు సమస్య ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్, హెయిర్‌కి కూడా ఈ నీరు ప్రయోజనాలు కలిగిస్తుంది. అధిక బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ నీరు మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి దీనికి ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు చల్లబరిచేందుకు బెండకాయ నీరు ఉపయోగపడుతుంది.